Advertisementt

ఈసారైనా ధనుష్‌ సక్సెస్ అవుతాడా..?

Fri 05th Feb 2016 07:29 PM
dhanush,maari movie,maari sequel,balaji mohan  ఈసారైనా ధనుష్‌ సక్సెస్ అవుతాడా..?
ఈసారైనా ధనుష్‌ సక్సెస్ అవుతాడా..?
Advertisement
Ads by CJ

హిట్టు చిత్రాలకు సీక్వెల్‌ చేయడం పెద్ద విశేషం కాదు. కానీ ఫ్లాప్‌ సినిమాకు సీక్వెల్‌ చేయడం మాత్రం అరుదే. కాగా రామ్‌గోపాల్‌వర్మను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి. 'ఐస్‌క్రీమ్‌' ఫ్లాప్‌ అయినప్పటికీ ఆయన దానికి సీక్వెల్‌గా 'ఐస్‌క్రీమ్‌2' చిత్రం చేశాడు. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ సైతం అదే రూటును ఫాలో అవుతున్నాడు. ఇటీవల ధనుష్‌ హీరోగా వచ్చిన 'మారి' చిత్రం ఫ్లాప్‌ అయింది. బాలాజీమోహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. ధనుష్‌ చెన్నై యువకుడిగా నటించిన 'మారి' చిత్రం రొటీన్‌ పాత్రలకు భిన్నమైన మాస్‌ కుర్రాడిగా గెటప్‌ను మార్చి ఈ సినిమాలో ధనుష్‌ నటించాడు. పావురాల పందెం కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్‌ వద్ద రాణించలేకపోయింది. ఇప్పుడు 'మారి' చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించాలని ఆ చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఈసారి అదిరిపోయే కథతో వస్తున్నామంటున్నాడు డైరెక్టర్‌ బాలాజీమోహన్‌. ప్రస్తుతం ధనుష్‌ 'దురైసెందిల్‌' చిత్రంతో బిజీగాఉన్నాడు. దీని తర్వాత ఓ హాలీవుడ్‌ మూవీలో నటించనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత ఆయన 'మారి' సీక్వెల్‌ చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. అక్టోబర్‌ నుండి ఈ చిత్రం పట్టాలెక్కనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ