పవన్‌కళ్యాణ్ వంటి హీరో కోరుకుంటే స్టార్ దర్శకులు సైతం సినిమా చేయడానికి వెంటపడుతారు. కానీ అదేంటో.. దర్శకుల ఎంపికలో ముందు నుంచీ గట్టి షాకులు ఇస్తున్నాడు పవన్. 'గుడుంబాశంకర్' నుండి తాజాగా 'సర్దార్ గబ్బర్‌సింగ్' వరకు ఆయన అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న దర్శకులకు పిలిచి మరీ సినిమాలను అప్పగిస్తున్నాడు. వీరశంకర్ నుండి బాబి వరకు ఈ లిస్ట్‌లో ఉన్నారు. తాజాగా తమిళ 'వేదళం' రీమేక్ కోసం సంతోష్ శ్రీనివాస్‌ను ఎంచుకొని అభిమానులను మరోసారి షాక్‌కు గురిచేశాడు. 'కందిరీగ'తో ఓ హిట్టు కొట్టి ఓకే అనిపించుకున్నాడు సంతోష్‌శ్రీనివాస్. ఆ తర్వాత 'రభస' డిజాస్టర్ అయింది. అలాంటి దర్శకుడిని వెతికి మరీ దర్శకుడిగా పిలిచి 'వేదాళం' సినిమా అప్పగించాడని ఇండస్ట్రీ టాక్. దీంతో నివ్వెరపోవడం పవన్ ఫ్యాన్స్ వంతైంది. శ్రీనివాస్‌కి పవన్ నుండి పిలుపు రావడం స్వయాన సంతోష్‌శ్రీనివాస్‌కే షాక్ కలిగించిందంట. మరి 'వేదాళం' రీమేక్‌తో అయినా ఈ కుర్ర దర్శకుడు తన స్టామినా నిరూపించుకొని పవన్ నమ్మకాన్ని నిలబెడతాడో లేదో వేచిచూడాల్సివుంది...!