Advertisementt

మహేష్‌ను ఎన్టీఆర్‌ క్రాస్‌ చేశాడు..!

Fri 05th Feb 2016 01:50 PM
mahesh babu,seethamma vakitlo sirimalle chettu,ntr,nannaku prematho  మహేష్‌ను ఎన్టీఆర్‌ క్రాస్‌ చేశాడు..!
మహేష్‌ను ఎన్టీఆర్‌ క్రాస్‌ చేశాడు..!
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో సంక్రాంతి సీజన్‌లో విడుదలైన 'నాన్నకు ప్రేమతో' చిత్రం అందరికీ బాగా కలిసి వస్తోంది. మొదట మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకొని కంగారు పెట్టినా ఇప్పుడు సంక్రాంతి రిలీజ్‌ల రికార్డును బద్దలు కొట్టి ఆనందాన్ని కలిగిస్తోంది. ట్రేడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ఇంతకాలం మహేష్‌బాబు-వెంకటేష్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో కలెక్షన్ల వైజ్‌గా టాప్‌ ప్లేస్‌లో ఉంది. 51కోట్లు సంపాదించి పెట్టి రికార్డు నెలకొల్పింది. 'నాన్నకుప్రేమతో' చిత్రం ఆ రికార్డులను బద్దలు కొట్టింది. 'నాన్నకు ప్రేమతో' ఇప్పటివరకు 50కోట్ల షేర్‌ సంపాదించినట్లు ఈ చిత్ర నిర్మాత స్వయంగా ప్రకటించాడు. ఈ చిత్రం థియేటర్స్‌లో ఇంకా వీకెండ్స్‌లో హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో క్లోజింగ్‌ బిజినెస్‌ నాటికి ఖచ్చితంగా ఈ చిత్రం మరిన్ని కోట్లు సంపాదించి పెడుతుంది. అందుకే ఈ చిత్రం ఇప్పటివరకు సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో కలెక్షన్లపరంగా టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంటోంది అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ