అవునన్నా కాదన్నా నాన్నకు ప్రేమతో చిత్రం అటు హిట్టుకి ఇటు ఫ్లాపుకి మధ్యలో కొట్టుమిట్టాడుతోంది. డబ్బులు పెట్టి లాభాలు పొందిన ఓవర్సీస్ బయ్యర్లు హిట్ అంటుంటే, ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ అండ్ నైజాం ఏరియాలలో నష్టాలు మూటగట్టుకున్న పంపిణీదారులు ఇది ఫ్లాప్ సినిమా అంటున్నారు. ఒక తారక్ సినిమా నాలుగంటే నాలుగు వారలలో వ్యాపారం క్లోజ్ చేసుకుంటోంది అంటే అది జనాలకు నచ్చినట్లా నచ్చనట్లా అన్నది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్న ప్రశ్న. తాజా సమాచారం ప్రకారం నైజాంలో నాన్నకు ప్రేమతో కనీసం 3 కోట్ల నష్టంతో ముగుస్తుంటే, సీడెడ్ బయ్యర్లు 1 కోటి, నెల్లూరు వారు 40 లక్షలు, కృష్ణాలో 80 లక్షలు, పశ్చిమ గోదావరిలో 10 లక్షలు, గుంటూరు 1 కోటి, వైజాగ్ ఏరియా వారు 1 కోటి పైనే నష్టాలు చవి చూడబోతున్నారు. సంఖ్యాబలం ప్రకారం తారక్ 50 కోట్ల క్లబ్బులో చేరినా నిర్మాతలు అడ్డగోలు రేట్లతో బయ్యర్లకు సినిమాను అంటగట్టడమే ఈ దుస్థితికి కారణం.