Advertisementt

కృష్ణాష్టమికి దిల్ రాజు స్కెచ్!

Thu 04th Feb 2016 04:16 PM
sunil,krishnashtami,feb 19 release  కృష్ణాష్టమికి దిల్ రాజు స్కెచ్!
కృష్ణాష్టమికి దిల్ రాజు స్కెచ్!
Advertisement
Ads by CJ

దిల్ రాజు గారి నిర్మాణంలో సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కృష్ణాష్టమి రిలీజ్ ఈనెల 19న అంటూ ముందుగానే సూచించారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో జనాల ముందుకు రావాల్సింది. కొన్ని రీ-షూటింగుల కారణం చేత, ఎదురు పోటీ లేకుండా విడుదల చేయాలన్న మరో కారణం చేత రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఏదైతే ఏమి 19వ తారీఖున అన్నారు కాబట్టి దిల్ రాజు గారు అన్నీ జాగ్రత్తగా స్కెచ్ చేసే ఉంటారు. అంతకుముందే అంటే రేపు స్పీడున్నోడు, వచ్చే వారం గరం, కృష్ణగాడి వీర ప్రేమగాథ వెళ్ళిపోతాయి కాబట్టి అటుపై వచ్చే వారం అంటే 19వ తేదీకి కృష్ణాష్టమి ఒక్కటే తప్ప మరో సినిమా అయితే బరిలో ఉండేలా లేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఫారెన్ షెడ్యూలు, రీషూటింగు వల్ల కృష్ణాష్టమి అనుకున్న బడ్జెట్ పరిమితులని దాటిపోయి సునీల్ సినిమాల్లోకెల్లా హయ్యెస్ట్ ఖర్చుతో తయారయింది. ఓవర్ వెల్మింగ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి రెండు లేదా మూడు వారాలు సమాంతర పోటీ లేకుండా ధియేటర్లలో నిలదొక్కుకుంటే గానీ రికవరీ కష్టం అంటున్నారు. నిర్మాత దిల్ రాజు గారు కాబట్టి ప్రీ రిలీజ్ వ్యాపారం విషయంలో అన్ని లెక్కలు పకడ్బందీగా ఉంటాయి. ఇక సునీల్ చరిష్మా ఎంత వరకు పని చేస్తుంది, దిల్ రాజు గారి బ్రాండ్ వ్యాల్యూ ఎంతవరకు రికవరీకి తోడ్పడుతుంది అన్నది 19 తరువాతే తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ