Advertisementt

మారుతి మెగా ఆఫర్ పట్టేసినట్లే!

Thu 04th Feb 2016 01:29 PM
maruthi,ram charan,allu arjun  మారుతి మెగా ఆఫర్ పట్టేసినట్లే!
మారుతి మెగా ఆఫర్ పట్టేసినట్లే!
Advertisement
Ads by CJ

ఒక సాదాసీదా డబల్ మీనింగ్ సినిమాల డైరెక్టర్ స్థాయి నుండి నేడు మెగా కుటుంబంలోని హీరోలతో సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుల జాబితాలో చేరిన మారుతి ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. కొన్నాళ్ళ క్రితం ఓ బ్యాడ్ బ్రాండుతో బాధపడ్డ మారుతి భలే భలే మగాడివోయ్, కొత్త జంట లాంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్సుకి బాగా చేరువయ్యాడు. ఈసారి వెంకటేష్ బాబుతో బాబు బంగారం అంటున్నాడు. వేసవికి విడుదలవనున్న ఈ మూవీతో మరోసారి మారుతి తన మ్యాజిక్ చూపనున్నాడు. ఇంతటితో ఆగనుందా, అబ్బే లేదు. అటు రామ్ చరణ్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు మెగా హీరోలూ మారుతితో కలిసి పని చేయడానికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కోసం ముందుగానే తయారు చేసుకున్న కథలు వినిపించడమూ, దానికి వారు ఓకే చెప్పడమూ జరిగిపోయాయి. కాకపోతే బన్నీకి, చెర్రీకి ఆల్రెడీ వేరే దర్శకులతో కొన్ని సినిమాలు కమిట్ అయి ఉన్నారు. అవన్నీ అయిపోతే గానీ మారుతి సినిమా పట్టాలు ఎక్కేలా లేదు. ఎలాగో అంగీకారం అయితే వచ్చేసింది. టైం కలిసొస్తే అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. ఆల్ ది బెస్ట్ మారుతి గారూ!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ