తన 8ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు హీరో నాని రిపీట్ కాంబినేషన్స్‌లో నటించలేదు. కానీ తాజాగా ఆయన తనను హీరోగా 'అష్టాచెమ్మ' చిత్రంతో హీరోని చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో సురభి హీరోయిన్‌గా నటించనుంది. వాస్తవానికి నేడు నాని అంటే ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. 'భలేభలే మగాడివోయ్' చిత్రంతో నేచురల్ స్టార్‌గా ఎదిగి 30కోట్ల రేంజ్‌కు తన స్టామినాను పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన తనకు నటునిగా జన్మనిచ్చిన దర్శకుడు ఇంద్రగంటి కెరీర్ ప్రమాదంలో పడిన నేపథ్యంలో ఆయనకు లైఫ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. కాగా నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రీకరణలో హనులోని టాలెంట్‌ను చూసి ముచ్చటపడిన నాని త్వరలో హను దర్శకత్వంలోనే మరో చిత్రం చేయడానికి సిద్దమవుతున్నాడు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రం హిట్టయితే ఈ ప్రాజెక్ట్ స్పీడుగా మొదలవుతుంది. మరి ఈ కృష్ణగాడు తన వీరప్రేమగాధను ఎలా చెప్పాడో? ఎలా చూపించాడో మరో వారం రోజుల్లోపే తేలిపోతుంది.