స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గీతాఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సరైనోడు' ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేయడానికి అల్లుఅరవింద్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే కొన్ని బ్యాడ్‌సెంటిమెంట్లు అభిమానులను భయపెడుతున్నాయి. ఇప్పటివరకు బన్నీ తన సొంత బేనర్ అయిన 'గీతాఆర్ట్స్' పతాకంపై మూడు చిత్రాలు చేశాడు. అవి 'గంగ్రోతి, హ్యాపీ, బద్రినాథ్'. 'గంగోత్రి' చిత్రం బన్నీ కెరీర్‌కు మంచి పునాదినైతే వేసింది కానీ ఈ చిత్రం పెద్ద హిట్ మాత్రం కాదు. ఇది కేవలం ఓ యావరేజ్ చిత్రం. ఇక 'హ్యాపీ, బద్రినాథ్' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇలా చూసుకుంటే బన్నీకి గీతాఆర్ట్స్ పెద్దగా కలిసిరాలేదని చెప్పవచ్చు. ఇక దర్శకుడు బోయపాటిశ్రీను విషయానికి వస్తే ఆయన యువ స్టార్ హీరోలకు పెద్దగా కలిసి రాలేదనే బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. మరి ఈ రెండు సెంటిమెంట్స్ ఇప్పుడు అభిమానులను కలవరపెడుతున్నాయి. మరి 'సరైనోడు'తో ఈ బ్యాడ్ సెంటిమెంట్లకు బన్నీ, బోయపాటి చెక్ పెడతారేమో వేచిచూడాల్సివుంది...!