రాహుల్ గాంధీ అనంతపూర్ పర్యటనలో చిరంజీవి కనిపించకపోవడంతో మరోసారి పార్టీ ఫిరాయింపు గాలివాటం వార్తలు ఊపందుకున్నాయి. అసలు సంగతి ఏమిటంటే, చిరంజీవి గారు గత కొన్నాళ్ళుగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో వారి ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు షోల్డర్ సర్జరీ చేయించుకోవాల్సిందే అని నిర్దారణకు వచ్చినా కొంత కాలంగా ఆ పనిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక రానున్న మరో నెల రోజుల్లో కత్తి రీమేక్ చిత్రం, 150వ ప్రాజెక్టుగా స్టార్ట్ అవుతున్న తరుణంలో చిరంజీవి గారికి మరింత రిస్క్ తీసుకునే సమయం లేదు. అందుకే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో నిన్నే ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ముంబైలోనే గడిపి ఈ నెల రెండో వారంలో మళ్ళీ హైదరాబాద్ తిరిగి ప్రయాణమవుతారు అని తెలుస్తోంది. ఇంతలోపు రామ్ చరణ్ తని ఒరువన్ రీమేక్ స్క్రిప్టు, కత్తి కథ మీద నరసింహారావు గారి ఇష్యూ కూడా కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. మెగా స్టార్ గారు శారీరకంగా ఫిట్టుగా ఉంటేనే కత్తిలో తన మార్కు పోరాటాలు, డ్యాన్సు స్టెప్పులతో అభిమానులను అలరించగలరు.