తమన్నాను హీరోయినుగా వాడుకోవాలంటే కోటి రూపాయల పైనే ఫీజు ఉంటుంది. అలాగని ఓ ఐటెం పాటలో స్టెప్పులు వేయమన్నా యాభై, అరవై లక్షలు పోయాల్సి వస్తుంది. ఏది ఏమైనా తమ సినిమాలో మాత్రం తమన్నా ఏదో ఒక రకంగా ఉండాల్సిందే అన్నది బెల్లంకొండ ఫ్యామిలీ సెంటిమెంట్. ముందుగా బెల్లంకొండ సురేష్ గారు కొడుకు సాయి శ్రీనివాసుని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన అల్లుడు శీనులో నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు అంటూ జోరు మీద స్టెప్పులేసిన తమన్నామరోసారి సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రెండో చిత్రం స్పీడున్నోడులో కూడా బ్యాచిలర్ బాబూ అనే ఐటెం పాటలో డ్యాన్స్ చేసింది. ఇక మూడోసారి మాత్రం ఐటెం కాదు ఏకంగా సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ అవనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మొదలవనున్న మూడో చిత్రం, ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇంకా మిగతా విశేషాలేవీ బయటకి పొక్కనీయలేదు గానీ, బెల్లంకొండ సురేష్ గారు నిర్మాత, తమన్నా హీరోయిన్ అండ్ సాయి హీరో అని ఫిక్స్ అయిపోయారు. తమన్నా లేకుండా బెల్లంకొండ కుటుంబం మొత్తం సినిమాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు అంటే ఇదేదో ఆశ్చర్యంగా లేదూ!