సినిమాల సంగతి పక్కకి పెట్టండి. పవన్ కళ్యాణ్ ఇమేజి ఒక్క సినిమాతోనో రెండు సినిమాలతోనో పెరిగేది కాదు, తగ్గేది కాదు. ఎందుకంటే ఈ రెగ్యులర్ సినిమాల గోల కంటే పవన్ చేరుకున్న స్థాయి ఎంతో ఎత్తయినది, ఉన్నతమైనది. అందుకే అంతకు మించిన రాజకీయ రంగు పులుముకునే పనిలో పవన్ కూడా బాగానే ఇన్వాల్వ్ అవుతున్నాడు. తునిలో కాపు కుల సమస్యగా మొదలైన ఖాండ, ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నా ఈ ఒక్క ఉదంతం వల్ల పవన్ కళ్యాణ్ చరిష్మా కొంత డ్యామేజి అయిందన్నది మీడియా వాదన. నాలుక మీద కేవలం నాలుగు మాటలు రాసుకొచ్చి మీడియా ముందు తుని ఘటన మీద స్పందన తెలియజేయాలనుకున్న పవన్ కళ్యాణ్ మొత్తంగా అభాసుపాలయ్యాడు. గ్రౌండ్ రియాలిటీ మీద కొంత అవగాహన లేకపోతే సమస్య మీద ఎలా రియాక్ట్ అవాలనుకున్నాడని మీడియా వారే గొనుక్కున్నారు. ఇదిలా ఉంటె కేరళ నుండి హుటాహుటిన వచ్చిన పవన్ కళ్యాణ్, ప్రెస్ మీట్ తదనంతరం మళ్ళీ కేరళలో సర్దార్ షూటింగ్ స్పాటుకి చేరుకున్నారని తెలుస్తోంది. ఇలా వచ్చి అలా పోవడం ఏమిటని, కనీసం నిన్న జరిగిన GHMC ఎన్నికల్లో ఓటేసి వెళ్ళినా ఓ ప్రయోజనం చేకూరేదని ఇంకొన్ని సెటైర్లు పడుతున్నాయి.