Advertisementt

మమతల తల్లికి మస్త్ డిమాండ్!

Wed 03rd Feb 2016 12:46 PM
ramya krishna,baahubali,rudraksha  మమతల తల్లికి మస్త్ డిమాండ్!
మమతల తల్లికి మస్త్ డిమాండ్!
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో శివగామిగా మరోసారి తనలోని అసలు సిసలైన నటనా పటిమను జనానికి అందించిన రమ్యకృష్ణ వెనువెంటనే మొన్న సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనలో కూడా సహజ అందం, నటనతో ఉతికి ఆరేసింది. అంటే బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లతో తన క్రేజును అమాంతం పెంచేసుకుంది. నదియా, సిమ్రాన్, మీనా అండ్ మరికొందరు హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి కొద్దోగొప్పో పేరు ప్రతిష్టలు సంపాదించినా రమ్యకృష్ణకి సమాన స్థాయిలో మాత్రం ఎవరూ రాలేదనే చెప్పుకోవాలి. అందుకే ఈ ఏడాది కూడా రమ్య డైరీ మొత్తంగా నిండి పోయిందట. మొదటగా భర్త కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న రుద్రాక్ష సినిమాలో పవర్ ఫుల్ పాత్రకు సైన్ చేసింది. అటు పైన కమల్ హాసన్ భార్యగా, శృతి హాసన్ తల్లిగా మళయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ మొదలు పెట్టబోతున్న మరో మూవీకి ఏప్రిల్ నుండి మూకుమ్మడిగా కాల్షీట్స్ ఇచ్చేసారట. వీటికి తోడు బాహుబలి రెండో భాగం చేతిలో ఉండనే ఉంది. ఇక ఈ ఏడాది మొత్తం రమ్యకృష్ణ బిజీబిజీ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ