Advertisementt

బంపర్ ఆఫర్ కొట్టేసిన మిల్క్ బ్యూటీ!

Wed 03rd Feb 2016 10:56 AM
tamanna,bollywood,prabhu deva  బంపర్ ఆఫర్ కొట్టేసిన మిల్క్ బ్యూటీ!
బంపర్ ఆఫర్ కొట్టేసిన మిల్క్ బ్యూటీ!
Advertisement
Ads by CJ

తమన్నాకు దక్షినాది భాషలలో ఉన్న గిరాకీ గూర్చి మనకు తెలిసిందే. ఈవిడ తెలుగులో సినిమా చేస్తే, అది తమిళంలో కూడా డబ్ అయి ఆడేస్తుంది. హీరోతో సంబంధం లేకుండా కేవలం హీరోయిన్ గ్లామర్ మీదే ధియేటర్లోకి వచ్చే ప్రేక్షకులకు తమన్నా పేరొక్కటే చాలు. అందుకే దర్శకుడిగా ఉండాల్సిన ప్రభుదేవా ఓ మాస్టర్ స్కెచ్ వేసి తమన్నాను హీరోయినుగా పెట్టి ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో AL విజయ్ చేత దర్శకత్వం చేయించి హారర్ కామెడీ చిత్రాన్ని నిర్మించి వదలబోతున్నాడు. ఈ హారర్ కామెడీ జోనర్‌ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఊపేస్తుండడంతో తమన్నా కూడా ఆఫర్ చేసిన దెయ్యం పాత్రని  సంతోషంగా ఒప్పేసుకుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ప్రభుదేవా హీరోగా చేస్తున్నారు. తమన్నా బాలివుడ్ డ్రీం ఇంకా ఓ సరైన దిశలోకి రావటం లేదు. చేసిన రెండు మూడు చిత్రాలు పరాజయం పాలు కావడంతో, దక్షినాది చిత్రాలకే ఓటు వేస్తోంది. కానీ ఈసారి మాత్రం బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తనకు అచ్చొచ్చిన తెలుగు, తమిళంలతో పాటుగా హిందీలో కూడా ఈ మూవీ ఒకేసారి రూపొందనుంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ