Advertisementt

కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ..!

Wed 03rd Feb 2016 08:48 AM
ramya krishna,krishna vamsi,rudhraksha movie  కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ..!
కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ..!
Advertisement
Ads by CJ

రమ్యకృష్ణ త్వరలో 'రుద్రాక్ష' టైటిల్‌తో రూపొందనున్న చిత్రంలో నటించనుంది. ఆమె భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వివాహానికి ముందు ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో 'చంద్రలేఖ' చిత్రం చేసింది. ఇప్పుడు మరోసారి ఆమె ఇలా 'రుద్రాక్ష'లో కీరోల్‌ చేస్తోంది. రీసెంట్‌గా 'బాహుబలి' చిత్రంలో శివగామిగా అదరకొట్టి మళ్లీ క్రేజ్‌ తెచ్చుకున్న ఆమె 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో నాగార్జునకు జోడీగా చేసి సినిమా విజయంలో తన వంతు పాత్రను పోషించింది. దాంతో కృష్ణవంశీ ఆమెను తన తాజా చిత్రంలో తీసుకున్నాడు. ఈ చిత్రం హర్రర్‌ మూవీగా రూపొందనుంది. రమ్యకృష్ణకు ఉన్న క్రేజ్‌ ఈ చిత్రానికి బాగా ప్లస్‌ కానుంది. అలాగే కృష్ణవంశీ చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మరింత శ్రద్ద పెడతాడని, ఆమెను ఇంతవరకు ఎవ్వరూ చూపని పాత్రలో చూపించబోతున్నాడట. కాగా ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు, ఐదుగురు హీరోలు నటించనున్నారు. ఈ చిత్రం ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ. మెయిన్‌రోల్‌ను అనుష్క పోషిస్తుండగా, మరో హీరోయిన్‌గా సమంతను తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా రమ్యకృష్ణను తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నాడు. ఈ చిత్రం మీడియమ్‌ బడ్జెట్‌లో తెరకెక్కనుంది. బిజినెస్‌పరంగా కూడా రమ్యకృష్ణకు ఉన్న క్రేజ్‌, హర్రర్‌ చిత్రం కావడం, కృష్ణవంశీ దర్శకత్వం కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ