అల్లు అర్జున్ కెరీర్ సరైన దిశలో పయనిస్తోంది. మూస కథలకు, కథనాలకు కాకుండా తన నుండి వచ్చే ప్రతి చిత్రంలో కొత్తదనం ప్రదర్శిస్తూ, మెగా క్యాంపు హీరోలకు సంబంధించి ప్రేక్షకాదరణ విషయంలో స్టైలిష్ స్టార్ అందరికన్నా ముందు నిల్చున్నాడు. నిజానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ రెండు గ్రూపులుగా మారినా వారి కుటుంబంలోని కుర్ర హీరోలు వీరిద్దరి నామస్మరణ చేయడం పరిపాటే. బన్నీ కూడా ఈ మెగా మామయ్యల మంత్రం జపిస్తూనే తనదైన ప్రత్యేక ముద్ర కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఈ కష్టం ఎంతలా ఉందంటే ఏడాదికి ఒక్క సినిమా వచ్చినా చాలు, అది రికార్డ్ బ్రేకింగ్ అవాలన్నది బన్నీ ఆలోచన. అందుకే రామ్ చరణ్ అండ్ మిగతా మెగా కుర్ర హీరోల ట్రాక్ రికార్డ్ విషయంలో అన్నింటా బన్నీ బాబే పైచేయిగా ఉన్నాడు. అటు సోషల్ మీడియాను వాడుకోవడం కానీ ఇటు అనుక్షణం అభిమానులకు తాజా సమాచారాన్ని అందివ్వడం గానీ, అల్లు అర్జున్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటోంది. అందుకే ఈ సంగతులని తీక్షణంగా గమనిస్తున్న మీడియా సోదరులకి బన్నీ సపరేటు జెండా ఎగరేస్తున్నాడా అన్న సంశయం కలుగుతోంది. సరైనోడు తరువాత ఈ అంశం మీద మనకు కూడా సరైన అవగాహన రావొచ్చు.