Advertisementt

త్వరలో... క్రేజీ కాంబినేషన్స్‌!

Mon 01st Feb 2016 01:08 PM
crazy combos,tollywood,kollywood,muragadoss with mahesh,allu arjun with linguswamy,pawan kalyan  త్వరలో... క్రేజీ కాంబినేషన్స్‌!
త్వరలో... క్రేజీ కాంబినేషన్స్‌!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో ఎవ్వరూ ఊహించని విధంగా క్రేజీ కాంబినేషన్స్‌ సెట్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ స్టార్స్‌ కొందరు కోలీవుడ్‌ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తుంటే కోలీవుడ్‌ హీరోలు టాలీవుడ్‌ డైరెక్టర్లతో కలిసి పనిచేస్తున్నారు. దాంతో ఇలాంటి కాంబినేషన్స్‌కు ఇటు టాలీవుడ్‌ అటు కోలీవుడ్‌లలో కూడా క్రేజ్‌ పెరుగుతోంది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కోలీవుడ్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌తో చేస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఇప్పుడు అందరి చూపును తనవైపుకు తిప్పుకొంటోంది. చాలాఏళ్ల కిందట ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో 'నాని' వంటి డిజాస్టర్‌ చేసిన మహేష్‌ మరలా ఇంతకాలానికి మరో తమిళ దర్శకుడితో .జోడీ కట్టడం ఇరు భాషా చిత్రాల ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంటోంది. ఇక పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ త్వరలో మరలా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో 'ఖుషీ2' చిత్రం చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌ త్వరలో సూర్య, రాజుసుందరం,జానీ మాస్టర్‌లలో ఎవరో ఒకరితో సినిమా చేయడం మాత్రం గ్యారంటీ అంటున్నారు. పవన్‌ తన కెరీర్‌లో చాలామంది తమిళ దర్శకులతో జోడీ కట్టివున్నాడు. కరుణాకరన్‌, ఎస్‌.జె.సూర్య, విష్ణువర్థన్‌, ధరణి తదితర డైరెక్టర్లతో ఆయన సినిమాలు చేసి ఉన్నాడు. మరో మెగాహీరో అల్లుఅర్జున్‌ త్వరలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. బన్నీ ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రస్తుతం విక్రమ్‌.కె.కుమార్‌తో '24' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సూర్య డైరెక్ట్‌ తెలుగు సినిమాను త్రివిక్రమ్‌శ్రీనివాస్‌తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక సూర్య తమ్ముడు కార్తి ప్రస్తుతం నాగార్జునతో కలిసి పివిపి సంస్థ నిర్మాణంలో తెలుగు దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వంలో 'ఊపిరి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పలు కాంబినేషన్స్‌ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో ఆసక్తిని రేపుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ