తన మొదటి చిత్రం 'బొమ్మరిల్లు'ను అత్యద్భుతంగా తెరకెక్కించి ఆ చిత్రం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న టాలెంటెడ్ డైర్టెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్. ఆ తర్వాత ఆయన చేసిన 'పరుగు' కూడా మంచి విజయమే సాధించింది. కానీ ఆ తర్వాత ఆయన చేసిన 'ఆరంజ్, ఒంగోలు గిత్త' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో ప్రస్తుతం ఆయన పేరే టాలీవుడ్‌లో ఊసే లేకుండా పోయింది. కాగా ప్రస్తుతం ఆయన తమిళంలో 'బెంగళూరు నాట్కల్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మలయాళంలో హిట్టైన 'బెంగుళూర్ డేస్'కు రీమేక్‌గా రూపొందనుంది. ఇందులో ఆర్య, రానా, సమంత, శ్రీదివ్య, బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5వ తేదీన తమిళనాట విడుదలకు సిద్దమవుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్స్, ట్రైలర్స్ బాగానే ఉన్నాయి. అయితే అనవసర మార్పులు చేర్పులు చేయకుండా మలయాళ చిత్రాన్ని యాజిటీజ్‌గా దింపేశాడని తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు భాస్కర్‌కు అగ్నిపరీక్షగా మారింది. ఈ చిత్రం అయినా హిట్టయితేనే ఆయనకు తమిళంలో, తెలుగులో అవకాశాలు వచ్చే పరిస్థితి. తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తే ఈ చిత్రాన్ని ఆయన దర్శకత్వంలోనే తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో పివిపి సంస్థతో పాటు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సిద్దంగాఉన్నారు. ఈ చిత్రం ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా ఇదే భాస్కర్‌కు చివరి చిత్రం అయినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు!