Advertisementt

ఇప్పట్లో దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమా లేనట్టే!

Mon 01st Feb 2016 12:21 AM
devisri prasad,sukumar,sukumar movie after nannaku prematho,ram charan,akhil  ఇప్పట్లో దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమా లేనట్టే!
ఇప్పట్లో దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమా లేనట్టే!
Advertisement
Ads by CJ

'నాన్న‌కు ప్రేమ‌తో' త‌ర్వాత దేవిశ్రీప్ర‌సాద్‌తోనే సినిమా ఉంటుంద‌ని ఆమ‌ధ్య చెప్పుకొచ్చాడు సుకుమార్‌. దిల్‌రాజు కూడా ఆ సినిమాని నేను నిర్మిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడేమో ఆ సినిమా ఊసే లేదు. అటు దిల్ రాజు మాట్లాడ‌టం లేదు, ఇటు సుకుమార్ కూడా ఏమీ చెప్ప‌డం లేదు. మీ కొత్త సినిమా సంగ‌తులేంటి? అని అడిగితే ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంద‌ని స‌మాధాన‌మిస్తున్నాడు సుక్కు. 'నాన్న‌కు ప్రేమ‌తో' త‌ర్వాత నెల రోజుల‌పాటు విరామం తీసుకొని దేవితో సినిమా తీస్తాన‌ని చెప్పిన సుక్కు ఇప్పుడు మాట మార్చి  చ‌ర్చ‌ల ద‌శ‌లో అంటున్నాడంటే ఆలోచించాల్సిందే. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా సుక్కు త‌దుప‌రి చేసే సినిమా  దేవితో మాత్రం ఉండ‌ద‌ని ఖ‌రాకండీగా చెబుతున్నారు. అదే స‌మ‌యంలో రామ్‌చ‌ర‌ణ్‌, అఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాని చూశాక నాగార్జున స్వ‌యంగా సుకుమార్‌కి ఫోన్ చేసి అఖిల్ కోసం క‌థేదైనా ఉంటే చెప్ప‌మ‌న్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. అలాగే రామ్‌చ‌ర‌ణ్ కూడా 'త‌ని ఒరువ‌న్' రీమేక్ త‌ర్వాత మీతోనే సినిమా చేయాల‌నుంద‌ని సుకుమార్‌తో చెప్పాడ‌ట‌. దీంతో ఆ ఇద్ద‌రికీ స‌రిప‌డేలా క‌థ‌లు రాసే ఆలోచ‌న‌లోనే సుకుమార్ ఉన్న‌ట్టు తెలిసింది. దేవికి కూడా ఈ విష‌యం తెలిసి త‌న సినిమాకంటే వాళ్ల సినిమాలే ముఖ్య‌మ‌ని, అవ‌య్యాకే మ‌న సినిమా గురించి ఆలోచిద్దాం లే అని త‌న స్నేహితుడైన సుకుమార్‌నే ప్రోత్స‌హిస్తున్నాడ‌ట‌. సో మ‌రో నెల రెండు నెల‌ల పాటు సుకుమార్ అజ్ఞాతంలోకి వెళ్లి స్క్రిప్టుల‌తో సిద్ధ‌మై వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ