విలేజ్ బ్యాక్ డ్రాపు మీద వచ్చే యూత్ చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది. ఈ కన్సిడరేషన్ మీదే హీరో రాజ్ తరుణ్ తన కొత్త బొమ్మ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఒప్పుకొని ఉంటాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా అండ్ కుమారి 21 ఎఫ్ సినిమాలతో ఊపు మీదున్న ఈ కుర్రహీరో చేసిన న్యూ మూవీ నిన్నే సినిమా హాళ్ళలో దిగింది. జనాల నుండి టాక్ కాస్తంత పాజిటివుగా రావడం అందరికీ నిజమైన ఊరట. నిజానికి శ్రీనివాస్ గవిరెడ్డి రాసుకున్న ఈ కథలో కొత్త పాయింట్ భూతద్దం పెట్టి వెతికినా దొరకలేదు. అయినా హ్యాట్రిక్ హీరో క్రేజ్ మీద బాక్సాఫీస్ దగ్గర ఇది సేఫ్ గేమ్. ఊళ్ళో పనిపాటా లేని హీరో ఫ్రెండ్స్ బ్యాచి, చిన్నప్పటి నుండే హీరోయిన్ అందాన్ని చూస్తూ ప్రేమతో ఆరాధించే హీరో, ఇక ఇద్దరి మధ్యా ప్రేమాయణం, ఆమె ప్రేమ దక్కించుకోవడానికి హీరో చేసిన సిత్రం ఏమిటి, ఇదీ కథ. ఇక ఈ చిత్రం తిలకించినవారికి తప్పకుండా రెండు పాత సినిమాలు అయితే ఆలోచనల్లో కదులుతాయి. ఒకటి జగపతి బాబు చేసిన కబడ్డీ కబడ్డీ, రెండోది వద్దే నవీన్ చేసిన మనసిచ్చి చూడు. ఈ రెండూ హిట్ చిత్రాలే కావడంతో ఫార్ములా ప్రకారం సీతమ్మను కూడా హిట్టు కిందే వేసేయాలి మరి!