Advertisement
TDP Ads

అటు లారెన్స్, ఇటు హన్సిక!

Sun 31st Jan 2016 08:02 PM
kalavathi,chandrakala,  అటు లారెన్స్, ఇటు హన్సిక!
అటు లారెన్స్, ఇటు హన్సిక!
Advertisement

హారర్ కామెడీ చిత్రాలకు గిరాకీ ఎంత మాత్రం తగ్గటం లేదు. మినిమమ్ గ్యారంటీ బేసిస్ మీద తక్కువ నుండి మీడియం బడ్జెట్ వరకు ఈ జోనర్లో వచ్చిన అన్ని సినిమాలకు సెల్లింగ్ ఫ్యాక్టర్ వెరీ హైగా ఉంటోంది. తెలుగు ఒక్కటే కాదు, తమిళంలోను ఇదే రకమైన వ్యాపారం కొనసాగుతుండడంతో, కొంత మంది సేలెబుల్  ఆర్టిస్టులను పెట్టేసుకుని రెండు భాషలలోను ఈ చిత్రాలను విడుదల చేసి ఈజీ లాభాలు గడిస్తున్నారు నిర్మాతలు. సినిమా వ్యాపారం అనేది ఓ స్కిల్. దీన్ని సరిగా ఫాలో అయినవారికి చక్కటి లాభాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పడానికి మరో మంచి ఉదాహారణ నిన్న విడుదలైన కళావతి. ఈ సీరిస్ ఫస్ట్ భాగం చంద్రకళ హిట్ కావడంతో కళావతికి రిలీజ్ ముందు నుండే అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు సుందర్ C గారు ఎవరినీ నిరుత్సాహపరచకుండా చంద్రకళ ఫార్ములానే అతిజాగ్రత్తగా రిపీట్ చేసి మరోసారి తన టార్గెట్ ఆడియెన్సుని సంతృప్తిపరిచేసారు. రిలీజుకి ముందే తెలుగు వర్షన్ నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ మీద చిత్రాన్ని వదలడం, అలాగే ఫస్ట్ డే వసూళ్లు కూడా ఆశావహంగా ఉండడంతో చంద్రకళ సిరీస్ మూడో భాగం మొదలెట్టుకోవచ్చు. లారెన్స్ చేసిన ముని సిరీస్ (ముని, కాంచన, గంగ)  కూడా అన్ని పార్ట్స్ హిట్. ఇప్పుడు హన్సిక చేసిన చంద్రకళ సిరీస్ కూడా హిట్టవడం హారర్ కామెడీకి ఉన్న డిమాండుని తెలియజేస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement