Advertisementt

నీ స్పీడుకి ఎదురుండదు అబ్బాయ్!

Sun 31st Jan 2016 07:58 PM
speedunnodu,sai sreenivas bellamkonda  నీ స్పీడుకి ఎదురుండదు అబ్బాయ్!
నీ స్పీడుకి ఎదురుండదు అబ్బాయ్!
Advertisement
Ads by CJ

ముందే చెప్పుకున్నట్లుగా ఈ వారం విడుదలైన నాలుగు సినిమాలకు వారాన్ని మించి ఆడే సత్తా లేదని ఓ ముందస్తు నిర్దారణకు బయ్యర్లు, ప్రేక్షకులు వచ్చేసారు. అందుకే రానున్న నాలుగైదు రోజుల రెవెన్యూని  అటు సంక్రాంతి నాలుగు, ఇటు కొత్త నాలుగు చిత్రాలు పంచేసుకుంటే వచ్చే శుక్రవారానికి ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ఖాళీ అయిపోయేలా ఉన్నాయి. అక్కడక్కడా మెయిన్ స్క్రీన్స్ మీద పెద్ద బొమ్మలు ఆడినా, సైడ్ థియేటర్స్ అండ్ B, C సెంటర్లలో ఫీడింగ్ కోసం కొత్త చిత్రాల మీద ఆధారపడాల్సిందే. లక్కీగా ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం స్పీడున్నోడు ఒక్కటే ఫిబ్రవరి 5న రిలీజ్ కాబోతోంది. పాత సినిమాలన్నీ ప్రేక్షకులు చూసెయ్యడం, కొత్తవెవీ ప్రేక్షకాదరణ చురగొనకపోవడం స్పీడున్నోడుకి కలిసొచ్చే అంశాలు. సినిమా మినిమమ్ పాజిటివ్ టాక్ గనక తెచ్చేసుకుంటే వారం రోజుల వరకు ఎదురుండదు. భీమనేని శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో ఇప్పటిదాకా చానా వరకు ఓ మోస్తారు చిత్రాలే రావడం కూడా స్పీడున్నోడు పట్ల ఆశాజనకమైన అంచనాలు నెలకొనడానికి దోహదపడుతోంది. అన్నీ కుదిరితే వారం, పది రోజులు వీరి స్పీడుకి బ్రేకులు ఉండకపోవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ