అల్లు అర్జున్ సరైనోడుకి రెండు నెలల ముందు నుండే సూపర్ బజ్ మొదలైంది. ప్రీ లుక్, ఫస్ట్ లుక్ అదిరిపోవడంతో అప్పుడే వ్యాపారం గురించి మాట్లాడేస్తున్నారు. రానున్న రెండు, మూడు వారాలకల్లా అన్ని ఏరియాల హక్కులు అమ్ముడయిపోతాయని, సుమారుగా 70 కోట్ల వరకు సినిమా ప్రీ రిలీజ్ స్థాయి ఉండవచ్చని మొన్నే విశ్లేషించాం. బన్నీ చివరి చిత్రాలు రేస్ గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవిలు వాణిజ్యపరంగా ఆశించిన ఫలితాలు రాబట్టుకోవడమే సరైనోడు బిల్డ్ అవుతున్న క్రేజుకి అసలు సిసలైన కారణాలు. వీటికి తోడు తన చిత్రాన్ని ఎప్పుడు, ఎలాంటి టైం చూసి వదలాలి అన్న రీజనింగ్ బన్నీకి తెలిసినంతగా మరే స్టార్ హీరోకి కూడా తెలియదన్నది అక్షర సత్యం. అందుకే గీత ఆర్ట్స్ టీం మొత్తం లెక్కలేసుకొని మరీ సరైనోడు మార్కెటింగ్ ప్రణాళికలు రచిస్తున్నాయట. టాలివుడ్, కాలీవుడ్, మాలివుడ్, శాండల్ వుడ్... దక్షినాది నాలుగు ఏరియాలలో స్టైలిష్ స్టార్ మార్కెట్ పదిలం. ఈసారి సరైనోడు సత్తా బాలివుడ్ దాకా వినబడాలని, ముంబై చిత్ర పరిశ్రమ వర్గాలు కూడా సరైనోడు గురించి చర్చించుకునేలా అన్ని రకాల ప్రమోషన్లు సరైన పద్ధతిలో ఉండాలని అల్లు అర్జున్ ఆదేశాలు జారీ చేసాడట.