Advertisementt

చైతు చూపు ఆ ఇద్దరిపైనే..!

Sat 30th Jan 2016 10:47 PM
naga chaitanya,majnu,maruthi,merlapaka gandhi  చైతు చూపు ఆ ఇద్దరిపైనే..!
చైతు చూపు ఆ ఇద్దరిపైనే..!
Advertisement
Ads by CJ

నాగచైతన్యకు ఓ మంచి హిట్‌ వచ్చి చాలాకాలమే అయింది. ఎవరు హిట్‌ సినిమా తీస్తే వారికి అవకాశం ఇవ్వడం చైతు స్టైల్‌గా మారింది. అలా ఆయన చేసిన 'దోచెయ్‌' ఫ్లాప్‌ కాగా, ప్రస్తుతం చందుమొండేటితో 'మజ్ను' చేస్తున్నాడు చైతూ. కాగా ప్రస్తుతం నాగచైతన్య దృష్టి మరో ఇద్దరు యంగ్‌ డైరెక్టర్స్‌ మీద పడింది. వారిలో 'భలే భలే మగాడివోయ్‌'తో తన సత్తా చాటిన మారుతి ఇందులో ఒకడు. కాగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రాలతో వరుసగా రెండు హిట్లు కొట్టిన మేర్లపాక గాంధీ మరొకరు. త్వరలో నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో చేస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఇక మలయాళ 'ప్రేమమ్‌'కి రీమేక్‌గా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న 'మజ్ను' షూటింగ్‌ జరుపుకుంటోంది. 'మజ్ను' తర్వాతి చిత్రం మారుతి లేదా మేర్లపాక గాంధీలలో ఎవరో ఒకరితో కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ