Advertisementt

ఇక బంగార్రాజుని నాగ్ వదలడా..?

Sat 30th Jan 2016 08:03 PM
nagarjuna,kalyan krishna,soggade chinni nayana,bangarraju  ఇక బంగార్రాజుని నాగ్ వదలడా..?
ఇక బంగార్రాజుని నాగ్ వదలడా..?
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో అత్యధిక లాభాలు పొందిన చిత్రం నాగార్జున నటించిన 'సోగ్గాడేచిన్నినాయనా'. ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను జెమినీ చానెల్‌ 6.45కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రంలో పాపులర్‌ అయిన బంగార్రాజు పాత్రకు కొనసాగింపుగా ఓ కథను తయారుచేసి సీక్వెల్‌ చేయాలని నాగ్‌ ఆశపడుతున్నాడట. అందుకోసం ఆయన ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్‌కృష్ణను పిలిచి బంగార్రాజు క్యారెక్టరైజేషన్‌ బేస్‌ చేసుకొని ఓ కథను తయారు చేయమని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. బంగార్రాజు పాత్ర తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్‌ అయింది. దాంతో ఆదే క్యారెక్టర్‌ను బేస్‌ చేసుకొని ఓ కొత్త కథను చెబితే బాగుంటుందని నాగ్‌ భావిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి కానుకగా 'బంగార్రాజు' మరోసారి ఆకట్టుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ