వాస్తవానికి ఎంత కొత్త దర్శకుడికైనా బాలయ్యకు స్టోరీ చెప్పి ఒప్పించడం చాలా సులభం అంటుంటారు అందరూ. 'ఒక్కమగాడు, లెజెండ్, సింహా, లయన్, డిక్టేటర్' వంటి పవర్‌ఫుల్ టైటిల్స్‌ను బాలయ్యకు చెప్పి ఆ తర్వాత టైటిల్‌కు తగ్గ కథను తయారుచేసుకుంటారని, టైటిల్ నచ్చితే.. ఇక బాలయ్యను మెప్పించడం చాలా సులభమని ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. అందుకే బాలకృష్ణను డైరెక్ట్ చేయాలని ఎప్పుడు కొత్త డైరెక్టర్స్ ఉత్సాహపడుతుంటారు. ఎందుకంటే బాలకృష్ణకు సరైన కథ పడితే సాలిడ్ హిట్ గ్యారంటీ అనేది అందరికీ తెలుసు. పవర్‌ఫుల్ టైటిల్, నాలుగైదు పవర్‌ఫుల్ డైలాగ్స్, వంశం గురించి, బాలయ్యను గురించిన పొగడ్తలతో కూడా ఓ రెండుమూడు సీన్లు ఉంటే ఇక బాలయ్య ఏమి పట్టించుకోడని టాలీవుడ్‌లో పేరుంది. తాజాగా 'పటాస్' డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల బాలకృష్ణను కలిసి ఓ స్టోరీలైన్ వినిపించాడట. టైటిల్‌గా 'రామారావుగారు' అనే టైటిల్‌ను చెప్పగానే బాలయ్య కూడా బాగా ఇంప్రెస్ అయి పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని అనిల్ రావిపూడికి హామీ ఇచ్చాడని సమాచారం. ఈమేరకు అనిల్‌రావిపూడి అండ్ టీం ఉత్సాహంగా వర్క్ మొదలుపెట్టారట. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించే అవకాశం ఉంది. దిల్‌రాజు ప్రస్తుతం అనిల్‌రావిపూడితో సాయిధరమ్‌తేజ్ హీరోగా 'సుప్రీమ్' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అనిల్‌రావిపూడి 'పటాస్' వంటి బ్లాక్‌బస్టర్ మూవీని కళ్యాణ్‌రామ్‌కు అందించడం కూడా బాలయ్య ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ ముఖ్యకారణం అని, కళ్యాణ్‌రామే అనిల్‌కు బాలయ్య అపాయింట్‌మెంట్ ఇప్పించాడని కూడా ఫిల్మ్‌నగర్‌లో వినపడుతోంది.