జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఇద్దరు క్లోజ్‌ఫ్రెండ్స్ పైగా ఇద్దరు పుట్టింది ఒకే రోజున. ఇద్దరి మధ్య ఒరేయ్ ఒరేయ్ అని పిలుచుకునే సాన్నిహిత్యం ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనోజ్ అల్లరి గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ... మనోజ్ వంద కోతులతో సమానం... అని కామెంట్ చేశాడు. ఈ విషయం ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతూ చివరికి మనోజ్ చెవిన పడింది. ఎన్టీఆర్ కామెంట్‌పై వెంటనే రిప్లై ఇచ్చిన మనోజ్ 'నేను వందకోతులతో సమానమైతే వాడు వెయ్యి కోతులతో సమానం..' అంటూ ట్వీట్ చేశాడు. ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే మనోజ్,రెజీనా జంటగా దర్శకుడు దశరథ్ డైరెక్షన్‌లో 'శౌర్య' చిత్రం రూపొందుతోంది. థ్రిల్లర్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసపుకున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్‌లుక్,టీజర్స్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. వేదా.కె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 31న శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. సినిమాలో మనోజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో ఇప్పటివరకు చేయని డిఫరెంట్ లుక్‌తో కనపడతున్నాడు. దర్శకుడు దశరథ్‌కు ఉన్న క్లాస్ అండ్ ఫ్యామిలీ ఇమేజ్, మనోజ్‌కు ఉన్న మాస్ ఇమేజ్ ఈ రెండింటిి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.