Advertisementt

హరీష్‌కు హ్యాండిచ్చిన బన్నీ..!

Sat 30th Jan 2016 12:49 PM
allu arjun,harish shankar,sainodu movie,vikram k kumar  హరీష్‌కు హ్యాండిచ్చిన బన్నీ..!
హరీష్‌కు హ్యాండిచ్చిన బన్నీ..!
Advertisement
Ads by CJ

'గబ్బర్‌సింగ్‌'తో అదరగొట్టి 'రామయ్యా వస్తావయ్యా'తో చతికిల పడిన దర్శకుడు హరీష్‌శంకర్‌. ఆయన ఆ తర్వాత 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' కూడా జస్ట్‌ ఓకే అనిపించుకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని అల్లుఅర్జున్‌ కూడా అన్నాడు. ప్రస్తుతం బన్నీ నటిస్తోన్న 'సరైనోడు' తర్వాత ఈ చిత్రం ఉంటుందని ఇంతకాలం హరీష్‌ ఎదురుచూపులు చూశాడు. బన్నీకి కథ చెప్పడం, దానికి బన్నీ ఓకే చేయడం జరిగాయనే ప్రచారం జరిగింది. కానీ బన్నీ 'సరైనోడు' తర్వాత 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌తో సినిమా చేయనున్నాడని కన్‌ఫర్మ్‌ అయింది. మరి ఆ సినిమా పూర్తయ్యే వరకు హరీష్‌శంకర్‌ ఎదురుచూస్తాడా? లేక మరో హీరోను వెతుక్కుంటాడా? అనేది వేచిచూడాల్సిన అంశం. ప్రస్తుతానికి అయితే బన్నీ హరీష్‌శంకర్‌కు హ్యాండిచ్చాడనే అందరూ అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ