అల్లుఅర్జున్‌కు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఆయన చిత్రాలు మలయాళంలోకి కూడా డబ్ అయి అక్కడ కూడా మంచి కలెక్షన్లతో నిర్మాతలకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా రామ్‌చరణ్ కూడా బన్నీ సహాయంతో మలయాళంలో మార్కెట్ పెంచుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. ఇక యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సైతం బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళం మార్కెట్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇక నుండి తన చిత్రాలను రెగ్యులర్‌గా మలయాళంలోకి అనువదించాలని ఆయన ఆలోచిస్తున్నాడు. దీనికి తగ్గట్లుగా ఆయన తాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న 'జనతాగ్యారేజ్' చిత్రం నుండే తన ప్రణాళికను అమలులో పెడుతున్నట్లు ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు. అందుకోసమే ఆయన ఈ చిత్రంలో మోహన్‌లాల్, నిత్యామీనన్‌లతో పాటు కేరళ స్టార్ ఫహాద్ ఫాజిల్‌లను తన చిత్రంలోకి తీసుకున్నాడని తెలుస్తోంది. బన్నీకి కంచుకోటగా మారిన మలయాళ మార్కెట్‌పై ఎన్టీఆర్ కూడా కన్నేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ చిత్రాలపై పడింది. మరి మలయాళంలో బన్నీకి దీటుగా ఎన్టీఆర్ కూడా క్రేజ్ తెచ్చుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది...!