ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఇటీవల విడుదలై ఓవర్‌సీస్ మార్కెట్‌లో మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ చిత్రం దాదాపు రెండు మిలియన్ మార్క్‌ను అందుకొంది. ఈ కలెక్షన్ల ఎఫెక్ట్ ఎన్టీఆర హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న 'జనతాగ్యారేజ్'పై పడింది. సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలు ఓవర్‌సీస్‌లో 5కోట్లను మించి అమ్ముడుపోయిన దాఖలాలు లేవు. అయితే 'జనతాగ్యారేజ్' చిత్రానికి మాత్రం అక్కడ 7కోట్లకు కొనడానికి ఓ బయ్యర్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి 'నాన్నకు ప్రేమతో' సినిమా తర్వాత ఎన్టీఆర్‌కు ఓవర్‌సీస్‌లో ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పనిచేసే జనతాగ్యారేజ్ సెట్ కోసం సారధి స్టూడియోస్‌లో మెకానిక్ షెడ్‌ను, దాని చుట్టూపక్కలుండే ప్రాంతాలకు సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ ఇప్పటికే ఈ సెట్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నాడు. ఫిబ్రవరి మొదటివారంలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ న్యూలుక్‌తో కనిపించనున్నాడు.