65ఏళ్ల వయసులో కూడా కేవలం నాలుగైదు నెలల్లో ఓ సినిమా పూర్తి చేయడం అనేది రజనీకాంత్‌కు నటన పట్ల ఉండే మక్కువకు ఉదాహరణగా నిలుస్తుంది. 'లింగా' చిత్రాన్ని కూడా ఆయన కేవలం ఐదు నెలల్లో పూర్తి చేశాడు. తాజాగా ఆయన యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మాతగా తమిళ, తెలుగు భాషల్లో 'కబాలి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. అక్కడ ఫిబ్రవరి 26దాకా జరిగే షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి మే నెలలో ఈచిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ఇటీవలికాలంలో రజనీకాంత్ చేస్తున్న తక్కువ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. ఈచిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ మాత్రం అద్బుతంగా సాగుతోంది. ఈ చిత్రానికి తమిళనాట థియేటికర్ రైట్స్ రూపంలోనే దాదాపు 120కోట్ల బిజినెస్ జరిగింది. మలేషియాలో ఈ చిత్రం రైట్స్ 10కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక యూఎస్‌లో 8.5కోట్లు, ఆస్రేలియాలో 1.65కోట్లకు అమ్ముడైంది. ఇక తెలుగులో ఈ చిత్రం రైట్స్ ఏకంగా 30కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తానికి ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ 150కోట్లకు చేరుకుంది. ఇక శాటిలైట్ రైట్స్, ఇతర రైట్స్ కలిపి ఈ చిత్రం నిర్మాతకు పెట్టుబడికి రెట్టింపు మొత్తం వచ్చే అవకాశం కనిపిస్తోంది.