Advertisementt

పాపం నయనతార ఊసే లేదు!

Fri 29th Jan 2016 03:22 PM
seethamma andalu ramayya sithralu,kalavathi,lol,nenu rowdeene  పాపం నయనతార ఊసే లేదు!
పాపం నయనతార ఊసే లేదు!
Advertisement
Ads by CJ

రేపు రిలీజవుతున్న నాలుగు సినిమాల్లో మూడు మాత్రం మంచి ఊపు మీద కనిపిస్తున్నాయి. అసలే సంక్రాంతి సందడి నుండి, నాలుగు పెద్ద చిత్రాల హడావిడి నుండి ఇప్పుడిప్పుడే చిన్న సినిమాల వైపు ప్రేక్షకులు దృష్టి మరలుస్తున్న సమయంలో వీలైనంతగా పబ్లిసిటీ చేస్తేనే చిన్న చిత్రాల ఉనికి కనపడేది, వినపడేది. అందుకే కాబోలు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు టీం మొత్తం తమ మూవీని అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటోంది. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ అర్థన మీడియాతో మింగిల్ అవుతున్నారు. ఇక కళావతికి కావాల్సిన కళ మొత్తం త్రిష, హన్సిక, సిద్ధార్థలు మీడియా ముందే మాట్లాడేసి మంచి బజ్ క్రియేట్ చేసారు. అలాగే లచ్చిందేవికి ఓ లెక్కుంది టీంలో హీరోయిన్ లావణ్య త్రిపాటి ఉండడం సూపర్ పాజిటివ్ ఫ్యాక్టర్ అయింది. నిన్నే సోగ్గాడే చిన్ని నాయనతో సూపర్ హిట్ కొట్టిన లావణ్య ఫేస్ వ్యాల్యూ మీదే ఈ మూవీ ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. ఇక నాలుగోది చెబితే గానీ గుర్తుకురాని నేనూ రౌడీనేలో నయనతార హీరోయిన్ అయినా నిర్మాతలు పెద్దగా మార్కెటింగ్ కార్యక్రమాలేవీ మొదలెట్టకపోవడంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆకర్షితులు అవటం లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ