Advertisementt

ఆ ఫీట్ కోసం అందాలరాక్షసి వెయిటింగ్!

Fri 29th Jan 2016 09:33 AM
lavanya tripathi,bhale bhale magadivoy,soggade chinni nayana,lacchimdeviki o lekkundi  ఆ ఫీట్ కోసం అందాలరాక్షసి వెయిటింగ్!
ఆ ఫీట్ కోసం అందాలరాక్షసి వెయిటింగ్!
Advertisement
Ads by CJ

'అందాలరాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్యత్రిపాఠి. ఆ తర్వాత కూడా ఆమె రెండు మూడు చిత్రాలలో నటించిన్పటికీ ఆమె ఎవ్వరినీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ గత ఏడాది నాని హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో ఆమె దశ తిరిగిపోయింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా మొన్నటి సంక్రాంతి సీజన్‌లో ఆమె నాగ్‌ సరసన నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో వరుసగా రెండు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలలో నటించిన ఘనత సాధించింది లావణ్యత్రిపాఠి. తాజాగా ఆమె హ్యాట్రిక్‌ కొడతాననే ఆశతో ఉంది. ఆమె మెయిన్‌లీడ్‌లో నటించిన 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర హీరోగా నటిస్తుండగా, రాజమౌళి శిష్యుడు జగదీష్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం కూడా హిట్టు అయితే ఇక మన టాలీవుడ్‌ స్టార్స్‌ అందరి చూపు ఆమెపై పడటం గ్యారంటీ అని చెప్పవచ్చు. మరి ఆ ఫీట్‌ను లావణ్య సాధిస్తుందో లేదో వేచిచూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ