సరైనోడులో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్కు చూసి నివ్వెరపోయిన అభిమానులకు ఇక సినిమాలో బన్నీ పోలీసాఫీసరు పాత్ర పోషిస్తున్నాడనీ, అదీ ఆడ ఎమ్మెల్యే క్యాథరీన్ థెరీసాకు బాడీగార్డుగా చేస్తున్నాడంటే జోష్ మామూలుగా ఉంటుందా. చాన్నాళ్ళ తరువాత బన్నీలోని యాక్షన్ యాంగిల్ మొత్తాన్ని ఆవిష్కరించే పనిలో పడ్డాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అప్పుడెప్పుడో పూరీ జగన్నాథ్ దేశముదురులో విపరీతమైన ఫైట్లు చేసిన అర్జున్ అటు తరువాత అంతటి పాత్రను మళ్ళీ చేయలేదు. ఇది పక్కా మాస్ పోలీసాఫీసర్ రోల్. సినిమా ఆద్యంతం ఎమ్మెల్యేని కాపాడే పనిలో బన్నీ చేసే ఫీట్లు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఎమ్మెల్యే, బాడీగార్డ్, రాజకీయ శత్రువులు... ఇవన్నీ వింటుంటే సరైనోడులో పొలిటికల్ హంగులు ఏమీ లేవు కదా అనే ఆలోచన కూడా వస్తోంది. వీరికి తోడు రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ కూడా అదనపు ఆకర్షణ. పోలీస్ పాత్రలో కాసేపు జీవించినందుకే అల్లు అర్జున్ రేస్ గుర్రం సూపర్ హిట్టయింది. ఇక సినిమా మొత్తం బన్నీ పోలీసు గెటప్పులో మాస్ మసాలాతో అలరిస్తుంటే అదిరిపోదు మరి!