చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య సంబంధాలు బాగోలేవని ఎప్పటి నుండో మనం వింటున్న గాలివాటం కబురుకు మరోసారి సమాధానం దొరికింది. మెగా బ్రదర్స్ ఎంచుకున్న దారులు వేరు వేరైనా వారి ఆలోచన మాత్రం ఒక్కటే. ఇక పవర్ స్టార్ అయితే అన్నయ్య మెగా స్టార్ పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని అవసరమైనప్పుడల్లా చాటి చెబుతూనే ఉంటాడు. మొన్న బ్రూస్ లీ అదే రామ్ చరణ్ ఓసారి పవన్ కళ్యాణ్ బాబాయిని కలిస్తే ఇప్పుడు అన్నయ్య చిరంజీవి వంతు వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో ఉన్న తమ్ముడిని చూడడానికి సమయం దొరకబుచ్చుకుని చిరంజీవి రావడం నిజంగా యూనిట్ మొత్తానికి సంతోషాన్ని పంచింది. దర్శకుడు బాబీ, నిర్మాత శరత్ మరార్, డ్యాన్స్ మాస్టర్ గణేష్, హరీష్ పాయ్, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ... ఇలా అందరూ కలిసి ఎంచక్కా దిగిన ఫోటో ఇదిగో పైన తిలకించండి. సర్దార్ పవన్, కత్తి చిరంజీవి కలిస్తే ఇంత సందడిగా ఉంటుంది మరి. ఇక రానున్న రోజుల్లో చిరు కూడా షూటింగులతో బిజీ అయిపోతారు కాబట్టి దొరికిన ఈ కాస్త ఖాళీ సమయాన్ని తమ్ముడితో పంచుకున్నాడు.