చూడ్డానికి షిమ్లా యాపిల్‌లా కనిపిస్తుంది హన్సిక. ఆమెని అందానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ చూడాలనుకొంటారు కుర్రాళ్లు. కాస్త బొద్దుగా కనిపిస్తుంటుంది కాబట్టి ఎలాంటి డ్రెస్సులేసినా ఆమె అందాలు ఎక్స్‌పోజ్ అవుతుంటాయి. అందుకే హన్సిక సినిమాలో ఉంటే కమర్షియల్ అంశాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని దర్శకనిర్మాతలు అభిప్రాయపడుతుంటారు. అయితే తమిళ దర్శకుడు సుందర్.సి మాత్రం హన్సికని మరో కోణంలో చూసినట్టున్నాడు. అందుకేనేమో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న తన కొత్త చిత్రం 'కళావతి' లో ఆమెని ప్రెగ్నెంట్‌గా చూపించేశాడు. సుందర్.సి ఆలోచనని పక్కనపెడితే అలాంటి పాత్ర చేయడానికి హన్సిక ఒప్పుకోవడం గ్రేట్.
తమిళంలో ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. కమర్షియల్ కథ అనగానే అక్కడ మొట్టమొదట గుర్తుకొచ్చేది హన్సికనే. అలాంటి ఇమేజ్ ఉన్న హన్సిక ప్రెగ్నెంట్‌గా కనిపించేందుకు ఒప్పుకోవడం మాత్రం చాలా గ్రేట్. అయితే సుందర్.సితోనూ, ఆయన భార్య ఖుష్బూతోనూ హన్సికకి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంవల్లే ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. 'కళావతి' లో హన్సిక ప్రెగ్నెంట్ వుమెన్‌గానే కాదు... దెయ్యంలా కూడా కనిపిస్తుంటుందట. సో... హన్సిక ఈ సినిమాతో నటిగా నిరూపించుకోవడం ఖాయమన్నమాట. హన్సిక కూడా అదే నమ్మకంతోనే ఉంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న మహిళల తీరును గమనించాకే సెట్స్‌పైకి వెళ్లానని... వాళ్లు ఎలా నడుస్తారో..నేనూ అలాగే నడుస్తూ పాత్రని పండించే ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చిందామె.