నాన్నకు ప్రేమతో విడుదలకు ముందు జూనియర్ ఎన్టీయార్ పట్ల తీవ్రమైన అసంతృప్తి అటు మీడియా వర్గాలలోను, ఇటు ప్రేక్షక వర్గాలలోను ఉండేది. తారక్ పాత్రికేయులతో ఎక్కువ కలివిడిగా ఉండడనీ, అలాగే అసామాన్య అభిమానగణం ఆలోచనలకు అనుగుణంగా కథలు ఎంచుకోడనీ విమర్శలు వినిపించేవి. కానీ ఈ ఒక్క సినిమాతో కథ మొత్తం తిరిగిపోయింది. ఫాదర్, సన్ సెంటిమెంట్ మీద ప్రధానంగా మైండ్ గేమ్ మీదే ఫోకస్ చేసి సుకుమార్ తీసిన ఈ క్లాస్ మూవీ తారక్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం 50 కోట్ల క్లబ్బులోకి రెండు వారాలు పూర్తిగా తిరక్కముందే ప్రవేశించింది. టెంపర్, ఊసరవెల్లి లాంటి ఎన్టీయార్ మార్క్ సినిమాలకు కూడా సాధ్యం కాని 50 క్రోర్ ఎంట్రీ నాన్నకు ప్రేమతోకి సాధ్యమయింది. నిజానికి డివైడెడ్ టాక్ మీదే ఇంత కలెక్ట్ చేసిందంటే మూకుమ్మడిగా పాజిటివ్ టాక్ వస్తే మరో పాతిక కోట్లు ఎకస్ట్రా వచ్చేవే. ఏదైతేనేమి, తారక్ ఎన్నేళ్ళుగానో ఎదురుచూస్తున్న ఎన్నో మైలురాళ్ళు ఈ 25వ చిత్రం ద్వారా అందుకోగలిగాడు. రానున్న రోజుల్లో మరిన్ని సూపర్ హిట్లు కొట్టడానికి కావలసిన మనో ధైర్యాన్ని పొందగలిగాడు.