సినిమా పట్ల మంచు మనోజ్ పడే కష్టానికి తగ్గ బాక్సాఫీస్ ఫలితం ఇంత వరకు రాలేదనే చెప్పాలి. మొదటి నుండీ మనోజ్ శైలి వారి కుటుంబంలోని మిగతా హీరోలకంటే భిన్నంగా ఉంటుంది. ఎక్స్ పరిమేంట్ కథలను కమర్షియలైజ్ చేసి ఏదైనా ప్రేక్షకులను కొత్తగా అందించాలన్న మనోజ్ తపన చాలాసార్లు గురి తప్పినా ఈసారి మాత్రం అలాంటి సమస్య ఉండబోదు అంటున్నారు. శౌర్య అనే మనోజ్ కొత్త చిత్రం ఒక థ్రిల్లర్ కథావస్తువుకు తోడయిన లవ్ స్టోరీగా మనలను అలరించనుంది. రేజీనా హీరోయిన్ అండ్ సున్నితమైన అంశాలను సవివరంగా చర్చించే దశరథ్ ఈ సినిమా దర్శకుడు. మూవీ టైటిల్లోనే ఇది ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ అని చెప్పేసి మంచి పని చేసారు. ఎందుకంటే ఈ ఒక్క ట్యాగ్ వల్లే ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగిపోయింది. వీటికి తోడు మనోజ్ లుక్కు కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా బాగుంది. నెలాఖరుకి విడుదలవున్న శౌర్య పాటలకి వేద అనే సంగీతదర్శకుడు మ్యూజిక్ అందించాడు. అన్నీ కుదిరితే ఫిబ్రవరిలో ఈ సినిమాను కొంచెం కొత్తగా తెర మీద చూసెయ్యొచ్చు.