మెగా క్యాంపు హీరోల్లో అల్లు అర్జున్ స్టామినా మొత్తంగా వేరు. చిరంజీవి, అల్లు అరవింద్ పేర్ల మీదే ఇండస్ట్రీలోకి ప్రవేశించినా బన్నీ తన కెరీర్ కోసం వేసుకున్న స్కెచ్చులు మామూలుగా లేవు. అందుకే ఇప్పుడు మెగా హీరోల్లో పవన్ కళ్యాణ్ తరువాత నిజమైన స్టార్ స్టేటస్ అండ్ విశిష్టమైన ఐడెంటిటీ కేవలం బన్నీకే బలంగా దక్కాయి. ఇక రేస్ గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాలతో అర్జున్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అందుకే స్టైలిష్ స్టార్ నుండి రానున్న సరైనోడు చిత్రానికి ప్రీ లుక్, ఫస్ట్ లుక్కులతోనే జనాల నోట్లో నానడం మొదలైంది. బిజినెస్ కూడా భారీ స్కేలులో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంత వరకు కేవలం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి ఉద్దండ పిండాల సినిమాలకు పలికే ధరలు సరైనోడుకి వర్తిస్తున్నాయట. ప్రీ రిలీజ్ వ్యాపారమే 70 కోట్ల వరకు టచ్ కావొచ్చు అన్నది ప్రాథమిక అంచనా. సరైనోడు గనక సరైన టైమింగుతో బాక్సాఫీసును బద్దలు కొడితే బన్నీని టాలివుడ్ టాప్ మూడులో కుర్చోబెట్టేస్తారేమో!