Advertisementt

వర్మకు వంగవీటి వార్నింగ్‌..!

Wed 27th Jan 2016 03:19 PM
ram gopal varma,vangaveeti ranga,vagaveeti radha  వర్మకు వంగవీటి వార్నింగ్‌..!
వర్మకు వంగవీటి వార్నింగ్‌..!
Advertisement
Ads by CJ

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకి వార్నింగ్‌లు కొత్తేమీ కాదు. బాలీవుడ్‌లో ఆయన తీసిన కొన్ని మాఫియా సినిమాలకు ఆయనకు పెద్ద పెద్ద డాన్‌ల నుండే బెదిరింపులు వచ్చాయి. తెలుగులో కూడా 'రక్తచరిత్ర' సినిమా ప్రారంభించే సమయానికి చాలామంది వ్యక్తులు వర్మను ఫోన్‌ చేసి మరీ బెదిరించిన సంగతి తెలిసిందే. అయినా ఆయన మొండిగా, ఒక విధంగా చెప్పాలంటే ధైర్యంగా ముందుకు వెళ్లాడు. రీసెంట్‌గా ఆయన 'వంగవీటి' టైటిల్‌తో వంగవీటి రంగా జీవిత చరిత్రతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశాడు. అప్పటి నుండి ఆయనకు మరోసారి వార్నింగులు మొదలయ్యాయి. విజయవాడకు చెందిన పొలిటికల్‌ లీడర్‌ వంగవీటి రాధా మాట్లాడుతూ... ఈ విషయంలో ఇప్పటివరకు తననుకానీ, తన ఫ్యామిలీ మెంబర్స్‌ను కానీ ఈ సినిమా విషయమై వర్మ వారిని సంప్రదించలేదన్నాడు. తన తండ్రి పేరుతో తీసే సినిమాలో ఏదైనా తేడా వస్తే మాత్రం జరగబోయే పరిణామాలకు తాను బాధ్యున్ని కాదని వర్మను హెచ్చరించాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంగవీటి రాధా మాట్లాడుతూ.. సినిమాలో ఉన్నది ఉన్నట్లు వాస్తవాలను చూపిస్తే తమకు ఏ అభ్యంతరం లేదని, అంతే తప్ప రంగా జీవితంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన కుమారుడిగా తానెలా స్పందిస్తానో, తనకంటే రంగా అభిమానులే ఎక్కువగా స్పందిస్తారని వర్మను హెచ్చరించడం జరిగింది. మరి దీనికి వర్మ ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ