సినిమా వారికి బోలెడు సెంటిమెంట్స్ ఉంటాయి. వరుసగా రెండు హిట్స్ పడితే గోల్డెన్‌లెగ్ అని పొగిడేసి భుజాన పెట్టుకొని మోస్తారు. వరుస ఆఫర్స్ ఇస్తారు. ఒక ఫ్లాప్ వస్తే మాత్రం రిస్క్ ఎందుకులే అని వాళ్లతో పనిచేయడానికి ఆసక్తి చూపరు. ఇప్పుడు అలాంటి పరిస్థితే సమంత ఎదుర్కొంటోందని సమాచారం. తాజాగా ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రారంభం కానున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో మొదట మెయిన్ హీరోయిన్‌గా సమంతను, మరో హీరోయిన్‌గా నిత్యామీనన్‌లను అనుకున్నారు. కాగా ఎన్టీఆర్ సమంతతో ఇప్పటికి మూడు సినిమాలు చేశాడు. కాజల్, సమంత హీరోయిన్లుగా నటించిన 'బృందావనం' విజయం సాధించింది. ఆ తర్వాత అదే సమంత అయితే వర్కౌట్ అవుతుందని, సెంటిమెంట్‌గా భావించి 'రభస, రామయ్యా వస్తావయ్యా' చిత్రాలలో అవకాశం ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ కావడంతో 'బృందావనం' తర్వాత లక్కీగా భావించిన సమంత, ఆ తర్వాత ఎన్టీఆర్ దృష్టిలో ఐరన్‌లెగ్‌గా మారిపోయింది. కాగా కొరటాల శివ చిత్రంలో సమంతను వద్దని ఎన్టీఆర్ ఆదేశించడంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. కానీ సెకండ్ హీరోయిన్‌గా మాత్రం నిత్యామీనన్‌నే ఫైనల్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం.