అకస్మాత్తుగా వచ్చినా, అనుకోకుండా వచ్చినా రాజమౌళి గారికి పద్మశ్రీ వచ్చింది. ఇది అందరం అంగీకరించాల్సిందే. తెలంగాణా ప్రభుత్వమా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమా లేక కర్ణాటకా ప్రభుత్వమా, ఎవరు రాజమౌళి పేరును సిఫార్సు చేసింది అన్న సంగతి కూడా గతం గతహా. ఇక సామాన్య జనాలైన మనలనే రాజమౌళి అవార్డు విషయం షాక్కి గురి చేస్తే స్వయానా అవార్డు అందుకోవాల్సిన ఆయన ఏ విధంగా స్పందిస్తారో అనుకుంటున్నారా. ఆయనా మన దారే.
అసలు ఇంతటి గౌరవానికి నేను అర్హుడినా అన్న ప్రశ్న నాకే తలెత్తుతోంది. తప్పకుండా ఆ స్థాయి నాకు లేదని చెప్పగలను. దాన్ని మించి ఇంకా ఎం చెప్పాలో అర్థంకాని పరిస్థితి. ఇదొక విచిత్రమైన ఫీలింగ్. నేను సాధించింది ఎంతో సాధించాల్సింది ఎంతో కూడా నాకు తెలుసు. కానీ ఇంతటి గౌరవం వరించడానికి నేను ఇంతవరకూ సృజనాత్మకంగా ఏమీ చేయలేదు. రామోజీ రావు గారు, రజినీకాంత్ గారు ఇలాంటి సత్కారాలకు సరైనవారు. వారి పక్కన నేను కుర్చోవాలంటే నాకు కొంత ఇబ్బందే, కానీ ఇదొక అద్భుతమైన గౌరవం అంటూ జక్కన్న చెప్పుకొచ్చారు.