ప్రస్తుతం స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ సినిమాలకు టాలీవుడ్‌లోనే కాదు... కేరళ.. ఓవర్‌సీస్‌లలో కూడా చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో ఆయన నటించిన రెండు చిత్రాలు వరుసగా మిలియన్ మార్క్ వసూళ్లను సాధించాయి. కాగా ప్రస్తుతం బన్నీ బోయపాటిశ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ పతాకంపై 'సరైనోడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసింందే. ఈ చిత్రం కోసం ఇప్పుడు ఓవర్‌సీస్‌లో ఎంతో పేరున్న పంపిణీదారులు, కేరళలోని బయ్యర్లు విపరీతమైన పోటీ పడుతున్నారు. క్రేజీ అమౌంట్‌లను వారు ఆఫర్ చేస్తున్నారని ట్రేడ్‌వర్గాల సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి టాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపుగా 55కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.