Advertisementt

బాలయ్యకు సూర్య నుండి పోటీ..!

Tue 26th Jan 2016 04:43 PM
balakrishna,adithya 999,surya,24 movie,time machine based movie  బాలయ్యకు సూర్య నుండి పోటీ..!
బాలయ్యకు సూర్య నుండి పోటీ..!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రాన్ని సైన్స్‌ ఫిక్షన్‌గా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా 'ఆదిత్య 999' తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. కాగా ఈ చిత్రం టైమ్‌మెషీన్‌ ఆధారంగా తెరకెక్కనున్న సినిమా. దాంతో ఈ చిత్రంపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా మరోవైపు దర్శకుడు విక్రమ్‌.కె.కుమార్‌ కూడా సూర్య హీరోగా 'టైమ్‌మెషీన్‌' కథాంశంతోనే దాదాపు ఆదిత్య 369లాంటి స్టోరీనే తయారుచేసుకొని '24'తో సమ్మర్‌లో రానున్నాడు. సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉండటంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఈ రెండు కథాంశాలు దాదాపు ఒకే విధంగా ఉంటే మాత్రం బాలయ్య చిత్రానికి తిప్పలు తప్పవు. ఎందుకంటే బాలయ్య కంటే ముందే సూర్య నటించిన '24' చిత్రం విడుదలకానుంది. ఇలా ఒకే జోనర్‌లో అది ఒకే పాయింట్‌ మీద ఆధారపడిన చిత్రాలు కావడంతో ఇప్పుడు '24' చిత్రం కోసం నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ