Advertisementt

తెలుగులో కొత్త రాగాలు...!

Mon 25th Jan 2016 06:25 PM
bheems,vasanth,praveen lakkaraju,express raja movie  తెలుగులో కొత్త రాగాలు...!
తెలుగులో కొత్త రాగాలు...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తెలుగులో ఇద్దరు ముగ్గురు మాత్రమే టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌గా ఉన్నారు. వారే దేవిశ్రీప్రసాద్‌, తమన్‌, కీరవాణి. కాగా కీరవాణి ఇప్పుడు చాలా పరిమితంగా మాత్రమే సినిమాలను ఎంచుకుంటున్నాడు. త్వరలో ఆయన రిటైర్‌ కూడా కానున్నాడు. ఇక స్టార్‌హీరోల చిత్రం అంటే వెంటనే గుర్తుకొచ్చే పేర్లు దేవిశ్రీప్రసాద్‌, తమన్‌. వీరిద్దరు పెద్ద పెద్ద సినిమాలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక అనూప్‌రూబెన్స్‌, మిక్కీ.జె.మేయర్‌లతో పాటు పరభాషా సంగీత దర్శకులైన గిబ్రాన్‌, గోపీసుందర్‌ వంటివారు కూడా లిమిటెడ్‌గా మాత్రమే పనిచేస్తున్నారు. ఈ సమయంలో మరో ఇద్దరు ముగ్గురు యువ సంగీత దర్శకులు భవిష్యత్తులో మంచి సంగీతాన్ని అందిస్తూ తమ కెరీర్‌ను సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నారు. వారే.. ప్రవీణ్‌ లక్కరాజు, విశాల్‌ చంద్రశేఖర్‌, భీమ్స్‌, డీజె వసంత్‌. వీరు తమకు వచ్చిన చిత్రాలన్నింటినీ ఒప్పుకొంటూ బిజీగా మారుతున్నారు. వీరిద్దరిపై టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకనిర్మాతలు, హీరోలకు బెస్ట్‌ ఆప్షన్‌గా మారుతున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు విషయానికి వస్తే 'గీతాంజలి, శంకరాభరణం' వంటి చిత్రాలకు మంచి సంగీతం అందించాడు. తాజాగా ఆయన పనిచేసిన 'ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక విశాల్‌ చంద్రశేఖర్‌ విషయానికి వస్తే ఆయన చాలాకాలం క్రితం ఓ చిన్న సినిమాకి సంగీతం అందించాడు. కానీ ఆయన ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయాడు. దాంతో తమిళ్‌లోకి వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. వీరిద్దరే గాక భీమ్స్‌, డి.జె.వసంత్‌లపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రవితేజ నటించిన 'బెంగాల్‌టైగర్‌' చిత్రానికి భీమ్స్‌ అందించిన ట్యూన్స్‌ ఆ చిత్రానికి బాగా హెల్ప్‌ అయ్యాయి. ఇక డి.జె.వసంత్‌ ప్రస్తుతం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న 'స్పీడున్నోడు' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గతంలో ఆయన భీమనేని దర్శకత్వంలోనే అల్లరినరేష్‌ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ మూవీ 'సుడిగాడు'కు మంచి సంగీతం అందించాడు. ఇలా యువ సంగీత కెరటాలు టాలీవుడ్‌లో ఆశలను రేకెత్తిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ