ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య వైవిధ్య చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో '24' అనేచిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇదో సైన్స్ ఫిక్షన్ అని అర్థం అవుతూనే ఉంది. సాధారణంగా స్టార్‌హీరోలు తమ చిత్రాలకు పవర్‌ఫుల్ టైటిల్స్‌ను ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కానీ ఈ చిత్రానికి '24' అనే టైటిల్ పెట్టడం వెనుక చాలా గట్టి రీజనే ఉందని కోలీవుడ్ మీడియా అంటోంది. అంతేకాదు.. ఈ చిత్రం కథ ఇదేనంటూ ఓ స్టోరీని చెబుతున్నారు. కోలీవుడ్ మీడియాకు సంబంధించి వినపడుతున్న ఆసక్తికర వార్త ఏమిటంటే... ఈ చిత్రం టైమ్‌మెషీన్ ఆధారంగా రూపొందిన కథ అని, ఇందులో సూర్య ఓ వాచ్ మెకానిక్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఆయనకు ఓ సైంటిస్ట్ పోగొట్టుకున్న వాచీ రిపేర్‌కు సూర్య దగ్గరకు వస్తుంది. వాస్తవానికి అది వాచి రూపంలో ఉండే ఓ టైమ్‌మెషీన్. ఈ వాచ్‌ను రిపేరు చేసే క్రమంలో సూర్య ఆ టైమ్‌మెషీన్ సహాయంతో కాలచక్రంలో గమనం సాగిస్తూ భూత, భవిష్యత్తు కాలాలలోకి వెళ్లిపోతాడు. కాగా ఈ చిత్రంలో సూర్య మూడు గెటప్‌లలో కనిపించనున్నాడట. ఒకటి దొంగ పాత్ర కాగా, రెండోది వాచ్ మెకానిక్ పాత్ర. మూడో పాత్ర మాత్రం ఈ చిత్రం లేటెస్ట్‌గా విడుదల చేసిన విధంగా విభిన్నంగా కనిపించనున్నాడు. ఇందులో సూర్య సరసన సమంత హీరోయిన్‌గా కనిపించనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సికిందర్' డిజాస్టర్‌గా నిలిచింది. కానీ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌కు మాత్రం సమంత బాగా కలిసి వచ్చిన సంగతి తెలిసింందే. కాగా ఈచిత్రం వేసవి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది.