చిరంజీవి 150వ సినిమా, రామ్ చరణ్ తదుపరి సినిమా అతితక్కువ టైం గ్యాపులో పట్టాల మీదకు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ గారే మీడియాకు చెప్పుకొచ్చారు. ఐఫా వేడుకలో భాగంగా మొట్ట మొదటిసారి స్టేజ్ మీద డ్యాన్స్ షో చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్న రామ్ చరణ్ మీడియా వారితో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయమై చర్చించారు. చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తని ఒరువన్ తెలుగు రీమేక్ ఫిబ్రవరిలో మొదలవనుండగా, తమిళ హిట్ కత్తి తెలుగు రీమేక్ చిరంజీవి గారి 150వ సినిమాగా వినాయక్ దర్శకత్వంలో మార్చిలో స్టార్ట్ అవనుంది. ఒక చిత్రంలో రామ్ చరణ్ హీరో అయితే, రెండో దానికి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండింటితో నాకు ఏడాది మొత్తం బిజీగానే ఉంటుంది అని చరణ్ అన్నారు. బ్రూస్ లీ, గోవిందుడు అందరివాడేలే ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడం, చిరంజీవి గారి బ్రూస్ లీ క్యామియో కూడా ఫ్యాన్స్ అందరినీ పూర్తిగా తృప్తిపరచకపోవడంతో రానున్న రెండు సినిమాలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే చరణ్ భారమైన భాద్యతనే ఈ సంవత్సరం మోయనున్నాడు.