ఇక బాహుబలి అంటే అదరగొట్టేసింది అన్న మాటను జంటపదంగా వాడాలేమో? ముందుగా రెవెన్యూల పరంగా భారతదేశ చలనచిత్ర చరిత్ర పుటలను తిరగరాసిన ఈ రాజమౌళి కళాఖండం ఇప్పుడు అవార్డుల వేడుకల్లో కూడా సత్తా చాటుతోంది. అదీ తెలుగు వర్షన్ ఒక్కటే అనుకుంటే కాదు. రాజమౌళి ముందు చూపుతో తమిళ, హిందీ భాషల్లో సైతం ఇది డైరెక్ట్ చిత్రంగా రావడం మంచిది అయింది. నిన్నే మొదలయిన సినీ తారల సినిమా పండగ ఐఫా వేడుకలో తమిళ బాహుబలి అన్నింటా ముందు నిలిచి పెక్కు అవార్డులను ఎగరేసుకుపోయింది. ముఖ్యంగా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు మేల్, ఉత్తమ సహాయ నటుడు ఫిమేల్, ఉత్తమ గాయకులు మేల్, ఉత్తమ గాయకులు మేల్ ఫిమేల్ అండ్ ఉత్తమ చిత్రంగా కూడా బాహుబలి నిలిచి అర డజన్ అవార్డులను కైవసం చేసుకుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అంటేనే ఒక మేటి బ్రాండ్ మరియు మేటి సెలబ్రేషన్. ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సమంగా చూస్తారు కాబట్టి బాహుబలికి ఇది సరైన గుర్తింపే.