Advertisementt

నయన్ ని చాలా పద్దతిగా చూపిస్తాడంట!

Mon 25th Jan 2016 01:47 PM
nayanthara,babu bangaram,venkatesh,maruthi  నయన్ ని చాలా పద్దతిగా చూపిస్తాడంట!
నయన్ ని చాలా పద్దతిగా చూపిస్తాడంట!
Advertisement
Ads by CJ

'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్‌ మారుతి స్టార్‌స్టేటస్‌ అందుకోవడంతో పాటు తనపై ఉన్న అశ్లీల చిత్రాల దర్శకుడు అనే ముద్రను చెరిపేసి, క్లీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలు కూడా చేయగలనని తనని తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. కాగా ఆయన ప్రస్తుతం వెంకటేష్‌-నయనతార జంటగా 'బాబు బంగారం' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నయనతార ఓ బ్రాహ్మణ యువతిగా సరికొత్త గెటప్‌తో పాటు సరికొత్త పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆమె డ్రస్సింగ్‌ నుండి వాచకం వరకు పూర్తిగా బ్రాహ్మణ యువతిగా ఆమె పాత్రను మారుతి తీర్చిదిద్దనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 'భలే భలే మగాడివోయ్‌' తరహాలో ఆ చిత్రంతో తనకు లబించిన పేరును నిలబెట్టేలా ఈ చిత్రాన్ని తీయాలని మారుతి పట్టుదలగా ఉన్నాడు. సితార క్రియేషన్స్‌ బేనర్‌తో కలిసి సురేష్‌బాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని సింగిల్‌ షెడ్యూల్‌లో వేగంగా పూర్తి చేసి సమ్మర్‌ కానుకగా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ