Advertisementt

నాగ్‌తో వైరం పెట్టుకొంటున్న జగ్గుబాయ్‌!

Mon 25th Jan 2016 12:31 PM
nagarjuna,jagapathi babu,dil raju,raviteja,yevado okadu  నాగ్‌తో వైరం పెట్టుకొంటున్న జగ్గుబాయ్‌!
నాగ్‌తో వైరం పెట్టుకొంటున్న జగ్గుబాయ్‌!
Advertisement
Ads by CJ

నాగార్జునకు జగపతిబాబుకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలాఏళ్ల కిందట నాగార్జున తన సొంతబేనర్‌లో అంటే అన్నపూర్ణస్టూడియోస్‌ బేనర్‌లో జగపతిబాబు హీరోగా సురేష్‌కృష్ణ దర్శకత్వంలో 'ఆహా' అనే చిత్రాన్ని కూడా నిర్మించాడు. కాగా ప్రస్తుతం జగపతిబాబు హీరో పాత్రలు మానేసి విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారాడు. తాజా సమాచారం ప్రకారం దిల్‌రాజు నిర్మాతగా 'ఓ మై ఫ్రెండ్‌' ఫేమ్‌ వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'ఎవడో ఒకడు' అనే చిత్రాన్ని నిర్మించాలని భావించాడు. కానీ ఓ వైపు రెమ్యూనరేషన్‌ విషయంలో విభేదాలు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. కానీ మీడియాలో మాత్రం కేవలం ఈ స్టోరీ విషయంలో దిల్‌రాజుకు రవితేజకు విభేదాలు రావడం వల్లే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ కథను నాగార్జునతో కలిసి చేయడానికి దిల్‌రాజు ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రంలో చాలా పవర్‌ఫుల్‌ విలన్‌ క్యారెక్టర్‌ కూడా ఉందని, ఆ పాత్రకు జగపతిబాబును ఒప్పించారని తెలుస్తోంది. మొత్తానికి స్టోరీతో పాటు జగపతిబాబు కూడా ఓకే చెప్పడంతో ఈ చిత్రంలో రవితేజ బదులు నాగార్జున నటించడానికి సిద్దంగా ఉన్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ