Advertisementt

నాగ్‌ దర్శకుల చేతుల్లోకి అఖిల్!

Mon 25th Jan 2016 12:19 PM
nagarjuna,akhil,akkineni akhil,soggade chinni nayana,oopiri  నాగ్‌ దర్శకుల చేతుల్లోకి అఖిల్!
నాగ్‌ దర్శకుల చేతుల్లోకి అఖిల్!
Advertisement
Ads by CJ

తన మొదటి చిత్రానికి ఏకంగా ప్రపంచాన్ని కాపాడే బాధ్యతలను తనపై మోసుకొని వినాయక్‌ డైరెక్షన్‌లో చేసిన తొలిచిత్రం 'అఖిల్‌' ప్లాప్‌ కావడంతో ఇప్పుడు అఖిల్‌ నటించబోయే రెండో చిత్రానికి దర్శకుడిని మాత్రం ఆయన తండ్రి నాగ్‌ ఫైనల్‌ చేయనున్నాడు. కాగా ఈచిత్రానికి తమ సొంత బేనర్‌లోనే నిర్మించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు నాగ్‌. ఇందుకోసం ఆయన అఖిల్‌ను రెండో చిత్రంతో హిట్‌ కొట్టే దర్శకులను ...ఆయన పరిశీలిస్తున్నారు. ఆల్‌రెడీ తనతో 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో హిట్‌ కొట్టిన కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణని గానీ, లేదా ప్రస్తుతం తాను నటిస్తున్న 'ఊపిరి' చిత్ర దర్శకుడు వంశీపైడిపల్లిలపై నాగ్‌ దృష్టి పడింది. దాదాపుగా అఖిల్‌ రెండో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరో ఒకరికి లభిస్తుందని సమాచారం. మొదటి చిత్రం విషయంలో అన్నింటినీ అఖిల్‌ నిర్ణయానికే వదిలేసిన నాగ్‌ రెండో చిత్రం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు హిట్టు ఇచ్చిన, తనతో కలిసి పనిచేసిన, తనకు ఎవరి టాలెంట్‌పై నమ్మకం ఉందో వారినే ఈ చిత్రానికి దర్శకత్వబాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చాడట నాగార్జున. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ